ఏంటి రష్మీ థాంక్స్ మాత్రమేనా...ఇంకేం లేదా...
on Jun 5, 2023
శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతీ వారం ఏదో ఒక సెగ్మెంట్ సరికొత్తగా ప్లాన్ చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఈవారం అలాంటిదే ఒకటి ప్లాన్ చేశారు. ఈ షోకి వచ్చిన సోహైల్ రష్మీకి ఇండైరెక్ట్ గా ప్రొపోజ్ చేసాడు. "రష్మీ నీకు ఒక చిన్న విషయం చెప్పాలి...ఇదేదో ప్రాంక్ అని అనుకుంటావేమో కానీ నీకు చాటింగ్ లో కూడా చెప్పాను కదా కలుద్దామని...చాలా మంది ఏం అనుకుంటారంటే సుధీర్, రష్మీ అని ఏదేదో అనుకుంటారు..కానీ ఆఫ్ స్క్రీన్ లో అలా ఏమీ లేదు.
నాకు మాత్రం ఎప్పుడూ రష్మిని కలవాలని ఉండేది. ఎప్పటినుంచో నిన్ను కలుద్దామని అడుగుతున్నా.. కానీ ఇప్పుడు అందరి ముందు అడుగుతున్నా" అని సోహైల్ అనేసరికి "నేనంటే ఇష్టం అంటున్నవ్ కదా నా షోస్ ఫాలో కావా..ఇష్టమున్న వాళ్ళు ప్రతీ ఒక్క డీటెయిల్ ఫాలో అవుతారు " అంది రష్మీ. షోస్ ఫాలో కావాల్సిన అవసరం లేదు..నీ ఇన్స్టాగ్రామ్ ఫాలో ఐతే చాలు అన్నాడు.. నీ కోసమే నేను స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ పెట్టా. కరోనా టైంలో తాను ఏడుస్తుంటే నేను వెళ్లి స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ పెట్టాను...అవునా కాదా రష్మీ...ఆ వీడియోస్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉన్నాయి" అని చెప్పాడు సోహైల్. "అవును నిజమే కరోనా టైంలో స్ట్రీట్ డాగ్స్ పరిస్థితి చూసి చాలా బాధపడ్డాను.
అప్పుడు సోహైల్ నువ్వేం బాధపడకు ఇక్కడ ఉన్న స్ట్రీట్ డాగ్స్ కి నేను ఫుడ్ పెడతాను..అని చెప్పి దాన్ని వీడియో కూడా తీసి పంపించాడు..చాలా థాంక్యూ" సోహైల్ అని చెప్పింది. "థాంక్యూ మాత్రమేనా..ఇంకేం లేదా..ఐనా నేనిప్పుడు ఏం అడిగాను" అన్నాడు సోహైల్.."ఇంకేం కావాలి కుదిరితే ఒక కప్పు కాఫీ" అంటూ డాన్స్ చేసింది. "ఏమిటి చెప్పు కలిసి డిన్నర్ కి, లంచ్ కి అలా వెల్దామా ..నేను నీ దగ్గరకు వస్తుంటే 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె 172 సార్లు కొట్టుకుంటోంది " అని సోహైల్ ప్రేమగా చెప్పేసరికి "చిన్నపిల్లలు ఉన్నార్రా" అని ఇంద్రజ సోహైల్ మాటల్ని మధ్యలో కట్ చేశారు. దాంతో ఇదంతా ఫ్లాప్ చేసింది మేడం.. ఐనా ఇదంతా ప్రాంక్...అంటూ సర్ప్రైజ్ ఇచ్చారు" రష్మీ, సోహైల్.
Also Read